: సారా సత్తిబాబా నన్ను విమర్శించేది..?: బొత్సపై హోంమంత్రి చినరాజప్ప ఫైర్
వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైరయ్యారు. ‘సారా సత్తిబాబా నన్ను విమర్శించేది?’ అంటూ మండిపడ్డారు. టీడీపీ శిక్షణ సదస్సులో లోకేశ్ తనను తిట్టారంటూ వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియాలో వైసీపీ నేతలు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్నదంతా అసత్య ప్రచారమని తేల్చి చెప్పారు. అటువంటి ప్రచారం చేస్తున్న ఇద్దరిని గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా మారి లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిన జగన్‌ను విమర్శించకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న లోకేశ్‌పై ఆరోపణలు గుప్పించడం సరికాదని బొత్సకు హితవు పలికారు.