: విజయవాడలో భారీ వర్షం.. దుర్గ గుడిలో భక్తుల ఇబ్బందులు


విజయవాడలో కొద్దిసేపటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దుర్గగుడిలో ఉన్న భక్తులకు వర్షం కష్టాలు తెచ్చిపెట్టింది. అమ్మవారి దర్శనం కోసం ఈ తెల్లవారుజాము నుంచే క్యూకట్టిన భక్తులకు వర్షంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షం భక్తులను కొంత ఇబ్బంది పెడుతోంది. వర్షంలో తడుస్తూనే భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు.

  • Loading...

More Telugu News