: కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. కానిస్టేబుల్ మృతి


జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు కాల్పులకు తెగబడ్డారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ పోలీస్ ఔట్ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారి కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించగా మరో కానిస్టేబుల్, ఓ పౌరుడు గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ముష్కరులు అక్కడి నుంచి పరారయ్యారు. జామ్‌నగరీ పికెట్ వద్ద ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News