: కథ వినను.. సెట్ లోకి రాను అని చెప్పాను: నటుడు మోహన్ బాబు


‘లక్ష్మీబాంబు చిత్రం కథ వినను.. సెట్ లోకి రాను' అని నాడు సినిమా తీసే ముందే చెప్పానని ప్రముఖనటుడు మోహన్ బాబు చెప్పారు. ‘లక్ష్మీబాంబు’ చిత్రం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, "నా కూతురికి ఈ కథ నచ్చితే, నా కూతురు నటిస్తే, మీకు కొద్దోగొప్పో డబ్బులు వస్తాయనుకుంటే, మీ ఇష్టం' అని ఈ చిత్ర నిర్మాతలకు చెప్పాను. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా సినిమా తియ్యండి అని చెప్పాను. ఈ చిత్రానికి పెద్ద దర్శకుడిని పెట్టుకుందామని నిర్మాతలంటే నేను చెప్పాను... ఈ రోజు చిన్న దర్శకులే రేపు పెద్దవాళ్లు అవచ్చు అని. మొట్టమొదట మేము స్వర్గం-నరకం చిత్రంలో నటించినప్పుడు మేము ఎవరము? అందరూ చిన్నవాళ్లే.. వాళ్లే పెద్దవాళ్లు అవుతారు. నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఇప్పటికీ, నేను, ఇళయరాజాగారు రోజూ మాట్లాడుకుంటాము. లక్ష్మి నటించిన కొన్ని చిత్రాలు చూస్తుంటే ఆమె ఎక్స్ ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అది అంతా, దర్శకుడి ప్రతిభే" అని మోహన్ బాబు అన్నారు.

  • Loading...

More Telugu News