: నా మనసుకు అనిపించింది ఎప్పుడూ జరుగుతుంది: దాసరి నారాయణరావు
‘నా మనసుకు అనిపించింది ఎప్పుడూ జరుగుతుంది’ అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. ‘లక్ష్మీ బాంబు’ చిత్రం ఆడియో విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ప్రేమమ్’ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత, ఆడియో విన్న తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తన మనసుకు అనిపించిందని, అలాగే హిట్టయిందని అన్నారు. ఇప్పుడు, 'లక్ష్మీ బాంబు’ చిత్రం ఆడియో ఫంక్షన్ లో కూడా అలాగే అనిపిస్తోందని, ఇది కూడా కచ్చితంగా హిట్ కొడుతుందని దాసరి అన్నారు.