: ‘లక్ష్మీబాంబు’ ఆడియో వేడుక... దాసరి విడుదల చేసిన తొలిసీడీ
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన ‘లక్ష్మీ బాంబు’ ఆడియో వేడుక కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది. కార్తికేయ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మోహన్ బాబు, మంచు లక్ష్మి, నటి హేమ తదితరులు పాల్గొన్నారు. దాసరి చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియో సీడీని ఆవిష్కరించారు. తొలి సీడీని మోహన్ బాబు అందుకున్నారు.