: ‘చై’ని గట్టిగా హత్తుకోవాలని ఆత్రుతగా ఉంది: నాగార్జున


తన పెద్ద కుమారుడు‘చై’ని హత్తుకోవాలని ఉందని ప్రముఖ టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కువైట్‌ లో కల్యాణ్‌ జ్యువెలరీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నాగార్జున, నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్‌’ విజయం సాధించడంపై స్పందించారు. ఇండియాకు వచ్చేస్తున్నానని, కువైట్ లో ఉన్న మనవాళ్లు తనపై చాలా ‘ప్రేమమ్‌’ కురిపించారని అన్నారు. వెంటనే ఇంటికి వెళ్లి ‘చై’ (నాగచైతన్య)కి ఓ పెద్ద హగ్‌ ఇవ్వాలని ఆత్రుతగా ఉందని నాగార్జున ట్వీట్‌ చేశారు. ఈ సందర్బంగా కువైట్ కల్యాణ్ జ్యుయలర్స్ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ఇంతకు ముందే సమంత ‘ప్రేమమ్‌’ విజయంతో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News