: పెళ్లయ్యాక వేరు కాపురం పెడదామని భార్య ఒత్తిడి చేసినా విడాకులు ఇవ్వవచ్చు: సుప్రీంకోర్టు


వివాహానంతరం వేరు కాపురం కోసం సతాయించే భార్యకు విడాకులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ చట్టం కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహానంతరం వేరు కాపురంపై జస్టిస్‌ అనిల్‌ ఆర్‌.దవే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. వివాహమయ్యాక వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన భారతీయ సంప్రదాయానికి విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్దచేసి చదివించినప్పుడు, వివాహానంతరం కన్నవారిని పోషించాల్సిన బాధ్యత, వృద్ధాప్యంలో వారి వద్ద డబ్బు ఉన్నా లేకపోయినా, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కుమారుడిపైనే ఉంటుందని జస్టిస్‌ దవే తీర్పులో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భర్తను అతని తల్లిదండ్రుల నుంచి దూరం చేయాలని చూసే భార్యకు విడాకులు ఇవ్వొచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహానంతరం భర్త తనతోమాత్రమే కలిసి ఉండాలని, సంపాదన తనకు మాత్రమే దక్కాలన్న స్వార్థం సరికాదని ధర్మాసనం హితవు పలికింది.

  • Loading...

More Telugu News