: మరో అణుపరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా?


ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని భయపెడుతున్న ఉత్తర కొరియా మరోసారి అణుపరీక్షకు సిద్ధమవుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ దేశంలోని అణుపరీక్ష నిర్వహించే ప్రాంతంలోని మూడు కాంప్లెక్స్ ల వద్ద కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. వచ్చే వారం (సోమవారం) అధికార వర్కర్స్ పార్టీ 71వ వార్షికోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మరోసారి ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఉత్తర కొరియా చేపట్టిన అణుపరీక్షలన్నీ దేశానికి సంబంధించి ప్రాధాన్యత గల రోజుల్లోనే జరిగాయి. ఈ నేపథ్యంలో, రానున్న సోమవారం ఉత్తర కొరియా అణుపరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తర కొరియా అణుపరీక్ష చేపట్టే అవకాశం ఉందని దక్షిణ కొరియా విదేశాంగశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News