: మాదాపూర్ లోని అపార్టుమెంట్ లో హైటెక్ వ్యభిచారం.. సీసీఎస్ పోలీసులపై దాడి


హైదరాబాద్, మాదాపూర్ లోని ఓ అపార్టుమెంట్ లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టురట్టయింది. మహారాష్ట్ర, కోల్ కతా యువతులను ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు ఆ అపార్టుమెంట్ కు వెళ్లి సోదాలు నిర్వహించారు. దీంతో, వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం బయటపడింది. అయితే, సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో వ్యభిచార కేంద్రం నిర్వాహకులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సైబర్ క్రైం ఎస్సై మదన్, కానిస్టేబుల్ మహేష్ కు గాయాలయ్యాయి. మాదాపూర్ పోలీసుల సాయంతో వ్యభిచార ముఠాలోని ముగ్గురు యువకులు, ఒక యువతిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News