: దేశంలోనే నంబర్ వన్ అవినీతిపరుడు చంద్రబాబు: రఘువీరా తీవ్ర వ్యాఖ్యలు


యావత్తు దేశంలోనే నంబర్ వన్ అవినీతిపరుడు నారా చంద్రబాబు నాయుడు అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి ప్రదేశ్ గా చంద్రబాబు మారుస్తున్నారని ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కాంట్రాక్టును విదేశాలకు కట్టబెట్టడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏపీలో కరవు మండలాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వర్షాలు కురవకపోవడంతో రైతులు పంటలు నష్టపోయారన్నారు. కరవు మండలాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News