: తిరుమలలో పోలీసుల అత్యుత్సాహం.. అతిథి గృహంలో భక్తుల నిర్బంధం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంలో వేంకటేశ్వరుడు విహరించనున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అయితే, కొండపై ఈరోజు పోలీసులు అత్యుత్సాహం చూపారు. రద్దీ ఎక్కువ కావడంతో భక్తులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో మాడవీధుల్లోకి వెళ్లేందుకు వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాంభగీచ అతిథి గృహంలో పోలీసులు భక్తులను నిర్బంధించారు. దీంతో అందులో బస చేస్తున్నవారు బయటకు రాలేకపోతున్నారు.