: విజయవాడ విద్యుత్ ఉపకేంద్రంపై పిడుగు...ఒకరి పరిస్థితి విషమం


విజయవాడ విద్యుత్ ఉప కేంద్రం (సబ్ స్టేషన్) పై పిడుగుపడిన సంఘటనలో ఇద్దరు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలో సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్ దెబ్బ తినగా, సిమెంట్ పెచ్చులూడి పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పిడుగు పడిన ప్రాంతానికి సమీపంలో ఉన్న నాలుగు కార్ల అద్దాలు, టైర్లు పగిలిపోగా, కొన్ని టూవీలర్స్ ధ్వంసమయ్యాయి. కాగా, పిడుగుపాటుతో ఆందోళన చెందిన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News