: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం తీసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈరోజు భేటీ అయింది. జిల్లాల విభజనలో తుది నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో ముసాయిదా నోటిఫికేషన్‌లో మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, పలు కీలక ఆర్డినెన్స్‌ల జారీపై కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భూసేకరణ అంశంపై కూడా ఓ నిర్ణయం తీసుకోనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల తొలగింపు అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.