: లోకేశ్ ముందు వణికిపోయే డిప్యూటీ సీఎం మాటను ఇక పోలీసులు ఏం వింటారు?: బొత్స
సీఎం తనయుడు, టీడీపీ నాయకుడు అయిన నారా లోకేశ్, ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లోకేశ్ ముందు డిప్యూటీ సీఎం చినరాజప్ప కూడా వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇక, ఆయన మాటను పోలీసులు ఏం వింటారని బొత్స విమర్శించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, లోకేశ్, చినరాజప్ప ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని, ఏపీ లో పరిపాలన ఎటుపోతోందో తెలియడం లేదని అన్నారు. విదేశీ కంపెనీల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ఏపీలోని ప్రభుత్వ శాఖలన్నీ అవినీతిలో మునిగిపోయాయంటూ బొత్స ఆరోపించారు.