: పాన్ మసాలా బ్రాండ్ అంబాసడర్ గా జేమ్స్ బాండ్... సోషల్ మీడియాలో జోకులు


చేతిలో గన్ను లేదా స్పై గాడ్జెట్స్ పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రత్యర్థులను మట్టుబెట్టే జేమ్స్ బాండ్... ఇప్పుడు అదే చేత్తో పాన్ మసాలా పట్టుకున్నాడు. ఎస్... జేమ్స్ బాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఉర్రూతలూగించిన పియర్స్ బ్రోస్నన్ ఇప్పుడు పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు. 63 ఏళ్ల బ్రోస్నన్ గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్, డై అనదర్ డే, ది వరల్డ్ ఈజ్ నాట్ ఇనఫ్ లాంటి సూపర్ హిట్ బాండ్ సినిమాల్లో నటించాడు. బ్రోస్నన్ నటించిన యాడ్ ప్రముఖ దిన పత్రికల్లో కూడా ప్రచురితమైంది. మరోవైపు, పాన్ మసాలా యాడ్ లో పియర్స్ బ్రోస్నన్ నటించడంపై నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. జేమ్స్ బాండ్ లవ్స్ పాన్ మసాలా అని... బ్రోస్నన్ పాన్ మసాలా యాడ్ లో నటించడం ఏమిటి? ఎలాంటి రోజులు వచ్చాయి? అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

  • Loading...

More Telugu News