: భార్య‌తో గొడ‌వప‌డి.. ఇద్ద‌రు పిల్లలతో విషం తాగించి, తనూ తాగేసిన భర్త


కుటుంబ క‌ల‌హాల‌తో త‌న‌ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా ఓ వ్య‌క్తి విషం తాగిన విషాద ఘ‌ట‌న ఈరోజు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొయ్య‌ల‌గూడెం మండ‌లం రామానుజ‌పురంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు వ్య‌క్తితో పాటు రెండేళ్ల అత‌ని కుమార్తె కూడా మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న 7 నెల‌ల మ‌రో చిన్నారిని జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చిన్నారి ప‌రిస్థితిని ప‌రీక్షించిన వైద్యులు ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  • Loading...

More Telugu News