: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించండి: రాజ్ నాథ్ కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆయన లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని... ప్రస్తుతం పరిపాలన నిర్వహించలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఆమె కోలుకునేంత వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని విన్నవించారు. రాష్ట్రంలో ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని... పరిపాలన అచేతనంగా ఉంటే అవి రెచ్చిపోయి, విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని తెలిపారు.