: హైదరాబాద్-సైబరాబాద్‌లను అభివృద్ధి చేశాం.. అమరావతినీ చేస్తాం: ఢిల్లీలో చంద్రబాబు
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్-సైబరాబాద్‌లను తాము అద్భుతంగా అభివృద్ధి చేశామని అన్నారు. ఇప్పుడు ఏపీ నవ్యరాజధాని అమరావతిని తాము అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో మేటైన నగరాల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని వ్యాఖ్యానించారు. కృష్టా, గోదావరి నదులు రాష్ట్రానికి ఎంతో కీలకమైనవని అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 22.5 శాతం వ్యవసాయ వృద్ధి సాధించినట్లు తెలిపారు.