: ఏపీ ఆదాయలోటు 6641 కోట్ల రూపాయలు: పూర్తి వివరాలు తెలిపిన యనమల
అమరావతిలోని వెలగపూడిలోని కొత్త సచివాలయంలో ఆర్థికశాఖ కార్యాలయంలో అధికారులతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్ధ సంవత్సరం ఆదాయ, వ్యయాలపై అధికారుల నుంచి యనమల వివరాలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఈ నెలాఖరుకి నెరవేర్చిన వారమవుతామని చెప్పారు. ఆర్థిక అంశాలపై పలు వివరాలు తెలిపారు. అవి... * గత అర్ధసంవత్సర ఆదాయలోటు 6641 కోట్ల రూపాయలు * గత అర్ధ సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.13671 కోట్లు * తాత్కాలిక సచివాలయ వ్యయం రూ.215 కోట్లు * మహిళా సంఘాలకు తొలివిడతగా వడ్డీరూపంలో దాదాపు రూ.1300 కోట్లు అందజేత.