: హస్తినలో వేడెక్కుతోన్న తెలంగాణం


దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణం ఊపందుకుంది. నేడు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించగా.. వారికి మద్దతిచ్చేందుకు రాష్ట్ర తెలంగాణ మంత్రులు రేపు హస్తిన పయనం కానున్నారు. మరోవైపు, తెలంగాణ జేఏసీ ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తోంది. సత్యాగ్రహ దీక్ష పేరిట నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి జేఏసీ కన్వీనర్ కోదండరాం, బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, టీఆర్ఎస్ శాసనసభ్యులు కేటీఆర్, ఈటెలతో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్థన రెడ్డి హాజరై తమ సంఘీభావం తెలిపారు.

  • Loading...

More Telugu News