: టీవీ లైవ్ షోలో సహనం కోల్పోయిన పోసాని కృష్ణమురళి... కాంగ్రెస్ నేత వీహెచ్ పై ఓ రేంజ్ లో బూతులు... మీరూ చూడండి!
ముక్కు సూటిగా మాట్లాడుతూ, ఆవేశాన్ని ఆపుకోలేడని పేరుపడ్డ ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావును రాయలేని, నోటితో చెప్పలేని బూతులతో తిడుతూ, మీదకు ఉరికి దాడి చేసినంత పని చేశాడు. సర్జికల్ దాడులపై టీవీ-5 చానల్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీని పోసాని పొగుడుతుంటే, వీహెచ్ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. తాను మోదీకి అభిమానినని ఆయన గురించి మాట్లాడే తీరుతానని పోసాని అనడంతో, వీహెచ్ కల్పించుకుని అలాగైతే బయటకు వెళ్లి మాట్లాడాలని గదమాయించారు. దీంతో అప్పటికే బీపీ పెంచుకుని మాట్లాడుతున్న పోసాని, ఆపుకోలేక తన కుర్చీలోంచి లేచి బూతులు తిడుతూ వీహెచ్ పైకి లంఘించాడు. ఆ సమయంలో లైవ్ షోను కట్ చేశారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.