: 'ట్విట్టర్' మాకు వద్దే వద్దంటున్న గూగుల్, యాపిల్, డిస్నీ


తనను తాను అమ్మకానికి పెట్టుకున్న ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ట్విట్టర్ ను కొనేందుకు పలు దిగ్గజ సంస్థలు లైన్లో నిలిచి వున్నాయని తొలుత వార్తలు రాగా, ఒక్కో సంస్థా వెనక్కు తగ్గుతూ వచ్చాయి. తొలుత వేరీజోన్, ఆపై యాపిల్, తరువాత గూగుల్ వెనక్కు పోగా, ఇప్పుడు వాల్ట్ డిస్నీ కూడా ట్విట్టర్ తమకు వద్దని తేల్చి చెప్పింది. ఇక ఈ రేసులో మిగిలివున్నది ఒక్క 'సేల్స్ ఫోర్స్' మాత్రమే. డిస్నీ కూడా వెనక్కు వెళ్లడంతో ట్విట్టర్ ఈక్విటీ వాటాల విలువ 17 శాతం దిగజారింది. తదుపరి త్రైమాసిక ఫలితాలను ట్విట్టర్ ఈ నెల 27న ప్రకటించనుండగా, ఆ తరువాత మాత్రమే ఓ ఆఫర్ ఇవ్వాలన్నది సేల్స్ ఫోర్స్ ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News