: లిథువేనియాలో ఎయిడ్స్ సోకని ప్రజలను గుర్తించిన శాస్త్రవేత్తలు


ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధికి ఔషధాన్ని కనిపెట్టేందుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు మరో మార్గం లభించింది. లిథువేనియాలోని ప్రజల్లో దాదాపు 16 శాతం మంది పుట్టుకతోనే ఎయిడ్స్ నిరోధకతను కలిగివున్నారని తేలింది. హెచ్ఐవీ వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించినా, ఏమీ కాదని గుర్తించిన శాస్త్రవేత్తలు, వీరి జన్యు క్రమం పలు పరివర్తనాలు చెందిన కారణంగానే ఎయిడ్స్ క్రిమి నిరోధకత వీరిలో అభివృద్ధి చెందిందని తేల్చారు. ఇక వీరి జన్యువులను అధ్యయనం చేస్తే, ఎయిడ్స్ కు చికిత్సా పద్ధతిని సులువుగా తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News