: రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురైన మలేషియా విమానం శకలాలు గుర్తింపు
రెండేళ్ల క్రితం గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 కోసం గాలిస్తోన్న అధికారులు ఫలితాన్ని సాధించారు. ఇటీవలే విమానానికి సంబంధించిన శకలాలను మలేషియా గుర్తించింది. శకలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మలేషియా ప్రభుత్వం అవి ఎంహెచ్ 370 శకలాలేనని ఈరోజు ధ్రువీకరించింది. ఎంహెచ్370 విమానం 2014 మార్చి 8న గల్లంతైంది. విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు ప్రయాణిస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో 200 మందికి పైగా ప్రయాణికులు, విమానసిబ్బంది మృతి చెందారు.