: సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో రాజ్‌నాథ్ కీలక భేటీ
భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ ఉగ్రవాదులు భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని జై సల్మేర్‌లో నాలుగు సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరికాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. అందులో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల హోంమంత్రులు కూడా పాల్గొంటారు. సరిహద్దుల్లో రక్షణ, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించి సూచనలు చేయనున్నారు. సమావేశంలో సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.