: సరిహద్దులో మళ్లీ బరితెగించిన పాక్.. దీటుగా బదులిస్తున్న భారత జవాన్లు
పొరుగు దేశం పాకిస్థాన్ మరోమారు బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని పరిపాటిగా చేసుకున్న పాక్ కశ్మీర్ సరిహద్దులో మరోమారు కవ్వింపు చర్యలకు దిగింది. పూంచ్ సెక్టార్ సమీపంలోని మాల్తీలో మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. సైనిక శిబిరాలు, జనావాసాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ చేస్తున్న దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ ప్రయోగిస్తున్న మోర్టార్ షెల్స్ జనావాసాల్లో పడుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.