: దెబ్బలెన్ని తగిలినా తలవంచే సమస్యే లేదు: హరికృష్ణ
తన తండ్రి దివంగత ఎన్టీఆర్ వద్ద పనిచేసిన 30 ఏళ్ల అనుభవం హిమాలయాలంత ఎత్తుతో సమానమని ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. తాను మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని, ఎన్ని దెబ్బలు తగిలినా, జీవితంలో ఎవరికీ తలవంచే సమస్యే లేదని స్పష్టం చేశారు. తలవంచే తత్వమే తనకుంటే, ఎన్టీఆర్ కడుపున పుట్టి ఉండే వాడిని కాదన్నారు. తన బాటలోనే తన కుమారులు కూడా నడుస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. టెంపర్, పటాస్ సినిమాలతో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తన 59వ ఏట రెండు విజయాలను కానుకగా అందించారని, ఇక 60వ ఏట పడిన తనకు ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' ని గిఫ్ట్ గా ఇచ్చాడని, కల్యాణ్ రామ్ నటించిన ‘ఇజం’ కూడా బాగా ఆడుతుందన్న నమ్మకముందని అన్నారు.