: తెలంగాణ ఉద్యోగులకు దసరా సెలవులు రద్దు
కొత్త జిల్లాల ఏర్పాట్లలో తలమునకలైన తెలంగాణ సర్కారు సచివాలయం, కలెక్టరేట్, తదితర ముఖ్య విభాగాల ఉద్యోగులకు దసరా సెలవులను రద్దు చేసింది. ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ, సాధారణ పరిపాలన, హోం, ఫైనాన్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరు కావాలని, వీరు తదుపరి కాంపెన్ సేటరీ, క్యాజువల్ లీవులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దసరా నాడు ఇప్పుడున్న 10 జిల్లాలకు అదనంగా మరో 21 జిల్లాలను ప్రభుత్వం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.