: నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.. ఆ విషయంలో ఆందోళన వద్దు: సీఎం చంద్రబాబు
ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలతో సమన్వయంతో ఉండాలని సూచించారు. టీడీపీ నాయకత్వ సాధికారత వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, వైఎస్ హయాంలో దోచుకున్న విధంగా దోచుకోవాలని కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారని, అది కరెక్ట్ కాదని అన్నారు. పార్టీ కోసం తమ ఆస్తులు త్యాగం చేసి, కష్టపడిన వారిని ఆదుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.