: నా ప్రేమ సంగతి మా అమ్మకు చెప్పేందుకు చాలా రోజులు వెయిట్ చేశా: నాగ చైతన్య
దక్షిణాది ముద్దుగుమ్మ సమంతతో తన ప్రేమ వ్యవహారం గురించి తన తల్లి లక్ష్మికి చెప్పేందుకు సరైన సమయం కోసం చాలా రోజులు వేచి చూశానని ప్రముఖ నటుడు నాగ చైతన్య అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా లవ్ సంగతి మా అమ్మ కు చెప్పేందుకు చాలా రోజులు వెయిట్ చేశాను. ఎందుకంటే, మా అమ్మ అంటే నాకు కొంచెం భయం, అందుకని, చాలా రోజులు ఆగిన తర్వాత ఈ విషయం చెప్పాను. అయినా, మా అమ్మ నాకు చాలా సపోర్ట్ గా నిలిచింది. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అమ్మ చాలా అండగా ఉండేది. మా అమ్మ చెన్నైలో ఉంటారు’ అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.