: సమంత చాలా ఫ్రాంక్.. మొహమాటం లేకుండా చెప్పేస్తుంది!: నాగ చైతన్య
‘నా కెరీర్ లో ఇప్పటివరకు ‘ప్రేమమ్’ చిత్రమే నా బెస్ట్ పర్ఫామెన్స్ చిత్రమని సమంత చెప్పింది’ అంటూ యువ కథానాయకుడు నాగచైతన్య సంబరపడిపోతున్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం తనకు చాలా బాగా నచ్చిందని చెప్పిందని, ఏ విషయమైనా ఫ్రాంక్ గా, బాగా లేకపోతే లేదని.. ఏ మొహమాటం లేకుండా సమంత చెప్పేస్తుందని అన్నాడు. ప్రేమమ్ చిత్రంలో టీనేజ్ కు సంబంధించిన సన్నివేశాలను చాలా బాగా ఎంజాయ్ చేశానని, ఎందుకంటే, ఇటువంటి సంఘటనలు తన జీవితంలో చాలా జరిగాయని నాగ చైతన్య చెప్పాడు.