: జయలలిత దత్త పుత్రుడుకి చేదు అనుభవం.. ఆసుపత్రి లోపలికి అనుమతించని పోలీసులు
తమిళనాడు సీఎం జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జయలలితను పరామర్శించేందుకు వెళ్లిన ఆమె దత్త పుత్రుడు సుధాకరన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు ఆయన్ని అనుమతించలేదు. దీంతో సుమారు గంటన్నర పాటు అక్కడే వేచి చూసిన ఆయన తిరిగి వెళ్లిపోయారు. కాగా, దీనిపై సుధాకరన్ మద్దతుదారులు మండిపడ్డారు. జయలలితను చూసేందుకు ఆయన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. మరోపక్క, జయలలిత మేనకోడలిని అంటూ వచ్చిన మహిళ దీపా జయకుమార్ కు కూడా ఈ సాయంకాలం చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.