: స్వీప్ షాట్లతో తండ్రి స్టీవ్ వాను తలపిస్తున్న ఆస్టిన్ వా
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మెన్ స్టీవ్ వా కొడుకు ఆస్టిన్ వా ఆటతీరు తన తండ్రిని తలపిస్తోంది. తండ్రి మాదిరి స్వీప్ షాట్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. జాతీయ అండర్-17 ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఆస్టిన్ వా 136 బంతుల్లో సెంచరీ చేశాడు. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కాగా, మ్యాచ్ అనంతరం ఆస్టిన్ వా మాట్లాడుతూ, క్రీజ్ లో నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని తనకు తెలుసని, ఔట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉందని అన్నాడు. అయితే, తమ జట్టు కొన్ని వికెట్లు కోల్పోవడంతో తొలుత ఒత్తిడికి గురయ్యానని, అయితే, తాను సెంచరీ చేసిన తర్వాత ఆత్మవిశ్వాసం వచ్చిందని అన్నాడు.