: జగన్ లా తండ్రికి త‌ల‌వంపులు తెచ్చే ప‌నులు నేను చేయ‌ను: మీడియాతో నారా లోకేష్


విజయవాడలోని కేఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ శిక్షణ తరగతుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేదిక‌పై ప్రసంగించిన త‌రువాత మీడియాతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయన సమాధాన‌మిస్తూ, వైసీపీ అధినేత‌, ఏపీ ప్రతిపక్ష నేత‌ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ అధినేత‌లా తండ్రికి త‌ల‌వంపులు తెచ్చే ప‌నులు తాను చేయ‌బోన‌ని చ‌మ‌క్కులు విసిరారు. త‌న తండ్రి చంద్ర‌బాబుకి చెడ్డ పేరు తీసుకురాన‌ని అన్నారు. కాగ, ఇటీవల తనకు భుజం నొప్పి వ‌చ్చింద‌ని, వైద్యుల సూచన మేరకే విశ్రాంతి తీసుకుంటూ తొలి రెండు రోజులు శిక్షణ త‌ర‌గ‌తుల‌కు రాలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News