: ఆర్జేడీ అధినేత లాలూను కలిసిన నిందిత ఎమ్మెల్యే


అత్యాచారం కేసులో బెయల్ పై ఇటీవల విడుదలైన ఆర్జేడీ నాయకుడు రాజ్ బల్లభ్ ఈరోజు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. కాగా, పదిహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జైలుకు వెళ్లిన ఆర్జేడీ నాయకుడు రాజ్ బల్లభ్ తాజాగా హైకోర్టు బెయిల్ పై విడుదలయ్యారు. బీహార్ ప్రభుత్వం ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాజ్ బల్లభ్ కలిసినట్లు సమాచారం. అత్యాచారం ఆరోపణలు కారణంగా రాజ్ బల్లభ్ ను ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్ బల్లభ్ కు బెయిల్ లభించడంపై ఈ కేసులో బాధితురాలితో పాటు బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ బల్లభ్ జైలు నుంచి బయటకు రావడంతో తనకు, తన కుటుంబానికి చాలా భయంగా ఉందని... పేర్కొంటూ ముఖ్యమంత్రికి, పలువురు పాత్రికేయులకు బాధితురాలు మెస్సేజ్ లు పెట్టడం విదితమే.

  • Loading...

More Telugu News