: చెన్నూరు బస్టాండ్ లో ప్రజా బ్యాలెట్ లో పాల్గొన్న వైఎస్ జగన్
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈరోజు కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నూరు బస్టాండ్ లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా? లేక ప్రత్యేక ప్యాకేజీ సబబా? అనే అంశంపై సీపీఐ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదానే కావాలంటూ బ్యాలెట్ లో ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం పులివెందులలో పర్యటించిన ఆయన అమ్మవారిశాలలో నిర్వహిస్తోన్న దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి రైతుల కష్టాలను గురించి అడిగి తెలుసుకున్నారు.