: ఈ దుస్థితికి గత ప్రభుత్వాలే కారణం: హైదరాబాద్ మేయర్
హైదరాబాద్ నగర ప్రస్తుత దుస్థితికి గత పాలకులే కారణమని మేయర్ బొంతు రామ్మోహన్ ఆరోపించారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాల మేరకు మౌలిక వసతులను మెరుగుపరచడంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. మురుగునీటి వ్యవస్థ లోపాలమయంగా ఉందని... వర్షం పడినప్పుడు రోడ్లపై నీరు నిలిచి నగర జీవనం అస్తవ్యస్తమవుతోందని అన్నారు. రానున్న తరాల కోసం డ్రైనేజీ, రోడ్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు.