: 19న నటి జయచిత్ర కుమారుడి పెళ్లి
నాటి నటి జయచిత్ర, ఎన్వీ గణేష్ ల కుమారుడు, సంగీత దర్శకుడు, హీరో అమ్రిష్ వివాహం ఈ నెల 19న జరగనుంది. చెన్నైకి చెందిన సుదర్శనం-జయశ్రీ దంపతుల కుమార్తె కీర్తితో అమ్రిష్ పెళ్లి జరుగుతుంది. చెన్నై ఎగ్మూర్ లోని రాణి మెయ్యమ్మై హాలులో 19 వ తేదీ ఉదయం పది గంటలకు అమ్రిష్ వివాహం జరగనున్నట్లు జయచిత్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం.