: శ్రీకాకుళంలో సినీ నటి ప్రణీత సందడి.. సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు


శ్రీకాకుళంలో సినీ నటి ప్రణీత సందడి చేసింది. ఒక వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం నిమిత్తం అక్కడికి వెళ్లిన ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కాగా, దక్షిణాది ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న ప్రణీత ప్రస్తుతం తమిళ, కన్నడ చిత్రాల షూటింగుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. తెలుగులో బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో ప్రణీత నటించింది.

  • Loading...

More Telugu News