: వేలి ముద్రలు తీసుకోకుండానే విత్తనాలు పంపిణీ చేయాలి: జగన్


విత్తనాల కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడాలంటూ అధికారులను వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న ఆయన ఈ రోజు పెండ్లిమర్రి గ్రామ రైతులను కలిశారు. ఈ సందర్భంగా, వేలి ముద్రలు వేయించుకుని విత్తనాల కూపన్లు ఇస్తున్నారంటూ జగన్ కు రైతులు ఫిర్యాదు చేశారు. దీని కారణంగా ఎంతో మంది రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జగన్... వేలి ముద్రలు తీసుకోకుండానే విత్తనాలను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. పాస్ పుస్తకాలపై వేరుశనగ కూపన్లను రైతులకు ఇవ్వాలని చెప్పారు.

  • Loading...

More Telugu News