: తమిళనాడులో అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అరెస్టు
పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దేశంలో భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం కేరళలో ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఎన్ఐఏ ఈరోజు మరో అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. తమిళనాడులోని తిరునల్వేలి పట్టణంలో కేరళకు చెందిన అనుమానితుడు సుభాని మొయినుద్దీన్(31) ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. సిరియాలో దాదాపు ఏడాది పాటు ఉన్న మొయినుద్దీన్ ఇటీవలే భారత్‌కు వచ్చాడు. ఆమధ్య ఇరాక్‌లోని మోసుల్ ప్రాంతానికి వెళ్లిన మొయినుద్దీన్ అక్కడ ఉగ్రవాదులతో కలిసి పనిచేశాడు.