: ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రదాని మోదీ శుభాకాంక్షలు
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి అతిభారీ రాకెట్ ద్వారా జీశాట్-18 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపిన సంగతి తెలిసిందే. దీనికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, దేశకీర్తి ప్రతిష్ఠలను ఇస్రో శాస్త్రవేత్తలు ఇనుమడింపజేశారని అన్నారు. ఇస్రో ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.