: శాసనమండలి చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన పాతూరి
తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. విప్ గా బోడకుంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు మహేందర్ రెడ్డి, చందూలాల్ లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మండలి సమావేశాలు నిష్పక్షపాతంగా, సజావుగా సాగేలా చూస్తానని తెలిపారు. అన్ని అంశాలపై సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తపన పడుతున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.