: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం ... భయంతో వణుకుతున్న విద్యార్థులు


తిరుప‌తిలోని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీలో చిరుత పులి సంచరిస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. చిరుత భయంతో విద్యార్థులు హాస్టళ్లలో నుంచి రాత్రి పూట బయటికి రాలేకపోతున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట చిరుత పులి కనిపిస్తూనే ఉందని చెబుతున్నారు. వర్సిటీలో ఉన్న ప‌లు జంతువుల‌ను తినాల‌నే ఉద్దేశంతోనే ఇది వ‌స్తూ ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. వ‌ర్సిటీలో శున‌కాలు, ఆవులు, జింకలు, అడవి పందులు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల అడవి పందిని వెంబడిస్తూ చిరుత క‌న‌ప‌డింది. ఈ ఘ‌ట‌న‌ను చూసిన ఓ విద్యార్థి త‌న‌పై కూడా దాడి చేస్తుందేమోన‌ని ప‌రుగులు తీశాడు. దీనిపై స్పందించిన వ‌ర్సిటీ అధికారులు న్యూ ఎంబీఏ బిల్డింగ్‌, ఐఏఎస్‌ఈ కాలేజీ పరిసరాల్లో ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందిని కాప‌లాగా ఉంచారు. సిబ్బంది రాత్రిళ్లు కూడా గ‌స్తీ తిరుగుతున్నారు.

  • Loading...

More Telugu News