: సర్జికల్ స్ట్రయిక్స్ ను వినియోగించుకొని ఉద్రిక్తత పెంచడం సరైన పద్ధతి కాదు: బి.వి.రాఘవులు
పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై ఇటీవల భారత సైన్యం చేసిన దాడులపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పందిస్తూ కేంద్రం తీరుని తప్పుబట్టారు. సర్జికల్ స్ట్రయిక్స్ ను వినియోగించుకొని ఉద్రిక్తత పెంచడం మంచిది కాదని అన్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. భారతసైన్యం గతంలోనూ సర్జికల్ దాడులు చేసిందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం వాటిపై ప్రచారం చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటివి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.