: విశాఖ లాంటి నగరం దేశంలో మరెక్కడా లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నం లాంటి నగరం దేశంలో మరెక్కడా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్పై సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో డిజిటల్ డిస్క్రిప్షన్, డిజిటల్ ఇన్నోవేషన్ మార్పులు అజెండాగా నిపుణులు ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ... సముద్రం, ఎత్తైన కొండలు విశాఖ ప్రత్యేకతలుగా అభివర్ణించారు. దేశ ప్రజలందరూ నరేంద్రమోదీ సర్కారుపై నమ్మకం ఉంచారని ఆయన అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఇండియన్లు సీఈవోలుగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్లను కొనియాడారు.