: ప్రయాణికుడికి గుండెపోటు.. శంషాబాదు ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్


హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కోల్ కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో పైలట్ అత్యవసరంగా ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. దీంతో ల్యాండింగ్ కు అనుమతి లభించినా, రన్ వే ఖాళీ లేకపోవడంతో ఇండిగో విమానం సుమారు 45 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది ఆసుపత్రికి సమాచారం ఇచ్చి వైద్యులను సిద్ధంగా ఉంచారు. విమానం ల్యాండ్ అవ్వగానే ఆయనకు చికిత్స ప్రారంభించారు.

  • Loading...

More Telugu News