: ఎయిమ్స్, విదేశీ నిపుణులతో జయలలితకు వైద్యం షురూ!
ఊపిరితిత్తుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ తో తీవ్ర అస్వస్థతకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక వైద్యచికిత్స ప్రారంభమైంది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఉన్న ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ నాయక్, పల్మనాలజీ నిపుణుడు కిర్మాణీ, అనెస్థటిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అంజన్ తో పాటు లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలే వివిధ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో నిన్నటి వరకు జయలలిత ఆరోగ్యంపై చెలరేగిన పుకార్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. జయలలిత కోలుకుంటున్నారని తమిళనాడు ప్రజలకు కూడా నమ్మకం కలుగుతోంది.