: నియోజకవర్గాల పునర్వ్యవస్ధీకరణకు రాజ్యాంగ సవరణతో పని లేదు: కేటీఆర్


తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని అన్నారు. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సాధ్యమేనని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలనావ్యవస్థలు సమర్థంగా పని చేసేందుకే చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా పెత్తందారీ వ్యవస్థపోయి అధికార వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. తద్వారా ప్రజలకు సుపరిపాలనతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి తెలంగాణలో ఆయా కొత్త జిల్లాలను ప్రకటించామని ఆయన తెలిపారు. సిరిసిల్లను జిల్లా చేస్తామంటే...బిడ్డకి ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయని, అలా ప్రకటించకపోతే మళ్లీ వారే సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చానంటున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, ఇన్నాళ్లు మహబూబ్‌ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌ గా ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News